– బోర్లం గ్రామంలో దాదాపు 8 వేల కోళ్ల మృతి
– ఆందోళన చెందుతున్న రైతులు
– సుమారుగా రూ. 18 లక్షలు నష్టం వాటిలిందని వివరణ
– ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి
– రైతు బోడ చందర్
బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ గ్రామీణ మండలంలోని బోర్లం గ్రామంలో గల కోళ్ల ఫామ్ లో మంగళవారం రోజు అంతు చిక్కని వ్యాధి సోకి దాదాపు 8,000 కోళ్లు మృతి చెందాయి. దీంతో రైతు బోడ చందర్ మాట్లాడుతూ కళ్ళముందే కోళ్లు పిట్టల్లా రాలిపోవడం చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన కోళ్లు కూడా బ్రతకవని ఆయన తెలిపారు. సుమారుగా రూ .18 లక్షలు నష్టం వాటిల్లిందని గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొద్దిరోజుల క్రితం బీర్కూర్, కోటగిరి, రుద్రూర్ మండలాలలో ఇదే విధంగా కోళ్లు వీళ్ళ సంఖ్యలో మృతి చెందిన విషయం తెలిసిందే.. పశుసంవర్ధక శాఖ అధికారులు రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించడానికి ల్యాబ్ కు పంపారు. అధికారులు క్షేత్రస్థాయిలో మిగతా రైతులకు సరైన అవగాహన కల్పించకపోవడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








