V1News Telangana

best news portal development company in india

భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ శాఖ పోలీసులు….

SHARE:

కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నిజాంసాగర్ మండలం మాగి వద్ద స్కార్పియో వాహనం లో కర్ణాటక నుండి మహారాష్ట్రకి తరలిస్తున్న 90 కిలోల గంజాయి ని ఎక్సైజ్ శాఖ పోలిసులు స్వాధీనం చేసుకున్నట్లు డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు.కామారెడ్డి జిల్లా గాంధారి మండలం జెమిని తండాకు చెందిన గుగులోత్ సత్నామ్,నల్గొండ జిల్లా కు చెందిన పాలెపు తిరుపతి గంజాయిని ఆంధ్ర, ఒడిస్సా బోర్డర్ నుండి తీసుకుని వచ్చి కర్ణాటక రాష్ట్రంలోని నాగిలిగిద్ద వద్ద నిలువ ఉంచి అక్కడి నుండి మహారాష్ట్ర లోని నాందేడ్ కి తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ శాఖ పోలీసులు తనిఖీలు నిర్వహించగా పారిపోయే ప్రయత్నం చేస్తుండగా వెంబడించి నిజాంసాగర్ మండలం మాగి వద్ద పట్టుకున్నట్లు డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి వివరాలు తెలియజేశారు.స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారుగారూ .22 లక్షల 50 వేలు ఉంటుందని.. సుమారు 90 కిలోల గంజాయి ఉండగా దానితోపాటు ఒక స్కార్పియో వాహనం,ఒక ద్విచక్ర వాహనాన్ని అదుపులోకి తీసుకుని నిందితులను రిమాండ్ కు తరలించారు.మరో వాహనంలో శీను,డప్పు శంకర్, వినోద్ లు పరారయ్యారని వారిని త్వరలో పట్టుకుంటామని తెలిపారు.కిలో గంజాయి వెయ్యి మంది విద్యార్థుల భవిష్యత్తును పాడు చేస్తుందని ఈరోజు స్వాధీనం చేసుకున్న గంజాయి సుమారు 90 కిలోలు 90 వేల మంది జీవితాలను పాడు చెయ్యకుండా కాపాడామని తెలిపారు.విద్యార్థుల తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు వారిపై ప్రత్యేక నిఘా ఉంచి వారు చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india