– మాజీ శాసనసభ్యులు యెండల లక్ష్మీనారాయణ
కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మండల కేంద్రంలో గల కోదండ రామాలయంలో తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించే ఉత్సవాలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, బాన్సువాడ ఇన్ చార్జ్ యెండల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా శాలువాలతో సత్కరించారు. అనంతరం ఈనాడు పత్రిక పాత్రికేయుడి కుమార్తెల నూతన వస్త్రధారణ మహోత్సవ కార్యక్రమానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంలో ఆయన వెంట బాన్సువాడ ఎమ్మెల్సీ పట్టభద్రుల కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి, నసురుల్లాబాద్ మండల అధ్యక్షులు సున్నం సాయిలు, ప్రణయ్, బసవరాజ్, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








