V1News Telangana

best news portal development company in india

ఎన్నికలలో వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి….

SHARE:

ఎన్నికలలో వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి….

– భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి నసురుల్లాబాద్ మండల నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

– ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్

నస్రుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో సోమవారం రోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి(BVHPS) నసురుల్లాబాద్ మండల నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో తాము అధికారంలోకి వస్తే వికలాంగుల సంక్షేమానికి పాటు పడతామని అనేక హామీలు ఇచ్చి మాయ మాటలతో వికలాంగుల ఓట్లను కొల్లగొట్టి అధికారంలోకి వచ్చారన్నారు. అధికారంలోకి వస్తే వికలాంగులకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం .. అధికారం చేపట్టిన నెల నుండే రూ.6000 పెన్షన్ ను కచ్చితంగా అమలు పరుస్తామని ప్రగల్బాలు పలికారని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వికలాంగులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తామని (AICC) జాతీయ మేనిఫెస్టో లో పొందుపరిచిన హామీని సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిగణలోకి తీసుకోకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం అవ్వడం చూస్తే వికలాంగుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న వివక్ష స్పష్టంగా తెలుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై హక్కుల సాధనకై శాసనసభ ఎన్నికల హామీల సాధన కొరకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తన తిరుగుబాటు ప్రారంభిస్తుందని సూచించారు. స్వతంత్ర భారతంలో ఏళ్ల తరబడి అంగవైకల్యం కారణంగా రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగులకు రాజస్థాన్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా విద్య, ఉద్యోగ అవకాశాలలో కల్పించిన విధంగా.. స్థానిక సంస్థల ఎన్నికల తో పాటు శాసనసభ,పార్లమెంటు ఎన్నికలలో సైతం జనాభా దామాషా ప్రకారం వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. లేనియెడల వికలాంగుల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పై తిరుగుబాటు చేసి తమ హక్కులను సాధించుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు జాదవ్ పండరి, ఉపాధ్యక్షులు లకావత్ మోహన్, నస్రుల్లాబాద్ మండల నూతన అధ్యక్షులు ఓండ్ల భాస్కర్, ఉపాధ్యక్షురాలు రాథోడ్ కవిత, బీర్కూర్ మండల అధ్యక్షులు షేక్ ముఖీం తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india