V1News Telangana

best news portal development company in india

ఆందోళన కలిగిస్తున్న విద్యార్థుల ఆత్మహత్యలు

SHARE:

– హాస్టళ్లలో సైకాలజిస్టులను వెంటనే నియమించాలి

– (A.I.S.B) జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్

నిజామాబాద్ ప్రతినిధి:

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా :
తెలంగాణ రాష్ట్రంలో హాస్టళ్లలో ఉన్న విద్యార్థుల ఆత్మహత్యలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయని (A.I.S.B) ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ అన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి,సాంఘిక సంక్షేమశాఖ మంత్రులను నియమించకపోవడం బాధాకరమని విమర్శించారు.హాస్టల్స్ నిర్వహణలో పర్యవేక్షణ లోపం కనిపిస్తుందన్నారు.ప్రతి హాస్టల్ల లో ప్రెండ్లీ నేచర్ కల్పించాలని ఆయన సూచించారు. అదేవిధంగా ప్రతి హాస్టల్ల లో సైకాలజిస్టులను వెంటనే నియమించి విద్యార్థుల్లో మనోదైర్యాని కల్పించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ఎలాంటి ఒత్తిడి నైనా తట్టుకునేలా విద్యార్థులలో ఆత్మస్థైర్యం పెంపొందించే విధంగా తయారు చేయాలని ఆయన పేర్కొన్నారు.మరియు తల్లి,తండ్రులు కూడా పరీక్షల సమయంలో విద్యార్థులను ఎలాంటి ఒత్తిడిలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india