V1News Telangana

best news portal development company in india

మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ను సన్మానించిన నాయకులు….

SHARE:

బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం రోజు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ ను నసురుల్లాబాద్ మండల మరియు మైలారం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఇటీవల వైస్ చైర్మన్ పదవీకాలం ముగియడంతో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని పలు కాలనీలలో చేసిన సేవలను కొనియాడారు. పార్టీ బలోపేతం కొరకు మరింత కృషి చేయాలని.. భవిష్యత్తులో ఎన్నో ఉన్నత పదవులు పొందాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోచి గణేష్ ,యువ నాయకులు శివ సూరి , సంజయ్, నసురుల్లాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు గొడిసెల నరసింహులు గౌడ్, టేకుర్ల సాయిలు, వెంకటి, రమేష్ , దేశ్ పాక్ సాయిలు ,శేఖర్ గౌడ్, దార పోశెట్టి , ఒండ్ల లక్ష్మణ్, మరియు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india