బీర్కూర్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో గల తెలంగాణ తిరుమల దేవస్థానం నందు మంగళవారం రోజు “రథసప్తమి” సందర్భంగా వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గల మాడవీధుల గుండా సూర్యప్రభ వాహనంపై మరియు స్వామి వారి స్వర్ణ రథంపై రథోత్సవ కార్యక్రమాన్ని, కోలాటం బృందం నృత్యాలతో అలరించారు.

అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఆలయ కమిటీ సభ్యులు భక్తుల సౌకర్యార్థం అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, తిమ్మాపూర్ గ్రామ ప్రజలు, కోలాట బృందం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బీర్కూర్, నసురుల్లాబాద్ మండలాల ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








