V1News Telangana

best news portal development company in india

ఘనంగా వసంత పంచమి వేడుకలు….

SHARE:

– అధిక సంఖ్యలో హాజరైన భక్తులు

– అమ్మవారికి ప్రత్యేక పూజలు, అక్షరాభ్యాసాలు నిర్వహణ

– భక్తుల సౌకర్యార్థం అన్ని మౌలిక వసతులు ఏర్పాటు

– ఆలయ కమిటీ సభ్యులు బాల్ రాజ్

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని నెమలి గ్రామంలో గల సాయిబాబా ఆలయ ప్రాంగణంలో గల సరస్వతి మాత ఆలయానికి సోమవారం రోజు వసంత పంచమిని పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిల్లలకు అక్షరాభ్యాసాలు నిర్వహించి వారికి విద్యాబుద్ధులు సక్రమంగా కలగాలని వేడుకున్నారు. వసంత పంచమి సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు విజయ్ కుమార్ (నందు) పోతా రెడ్డి, బాలరాజ్, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india