V1News Telangana

best news portal development company in india

భారీ సాంస్కృతిక ప్రదర్శన సభను విజయవంతం చేయాలి….

SHARE:

– “లక్ష డప్పులు వేయి గొంతులు”గోడ ప్రతుల ఆవిష్కరణ

– ప్రభుత్వంతో కొట్లాడి హక్కులు సాధించుకోవాలని మాదిగలకు పిలుపు

– “ఎస్సీ వర్గీకరణ” పై సవతి తల్లి ప్రేమ ఒలకబోస్తున్న మాలలు

– MSF జిల్లా అధ్యక్షులు మెక్కా సాయి

– MRPS నసురుల్లాబాద్ మండల కన్వీనర్ టేకుర్ల సాయిలు

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో సోమవారం రోజు అంబేద్కర్ చౌరస్తాలో”MRPS మరియు MSF నాయకులు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ “సాధించుకోవడానికి ఫిబ్రవరి 7వ తేదీన మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోయే భారీ సాంస్కృతిక ప్రదర్శన “లక్ష డప్పులు వేల గొంతులు”గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా MSF జిల్లా అధ్యక్షులు మెక్కా సాయి మాట్లాడుతూ ప్రభుత్వంతో కొట్లాడి మన హక్కులు సాధించుకోవడానికి ఈ భారీ బహిరంగ సభకు మాదిగ ఉప కులాలకు చెందిన వారందరూ సంకన డప్పులతో అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. మాదిగలు కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో ప్రభుత్వానికి తెలిసే విధంగా చేయాలంటే ప్రతి ఒక్కరూ సంఘటితంగా కదలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో MRPS నస్రుల్లాబాద్ మండల కన్వీనర్ టేకుర్ల సాయిలు,MSF నాయకులు మావురం శ్రీకాంత్, బంగారు రవి, గంగాధర్, దర్శనం హన్మండ్లు, మైసయ్య, గంగారాం, మోహన్, దేశ్పాక్ సాయిలు, టేకుర్ల పోశయ్య, సాయిలు, టేకుర్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india