V1News Telangana

best news portal development company in india

గొప్ప మనసు చాటుకుంటున్న ప్రవాస భారతీయుడు….

SHARE:

– మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి ఆర్థిక సహాయం అందజేత

– భవిష్యత్తులో ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా

– నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటున్న యువ నాయకులు

– అనాధ, పేద విద్యార్థులకు చదువుల కొరకు ఆర్థిక సహకారం అందిస్తానని వెల్లడి

– బిజెపి నాయకులు( NRI) కోనేరు శశాంక్

బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ నియోజకవర్గ బీజేవైఎం కార్యకర్త సిహెచ్. దేవేందర్ వారం రోజుల క్రితం పరమపదించారు. విషయం తెలుసుకున్న బాన్సువాడ నియోజకవర్గ బిజెపి నాయకులు NRI కోనేరు శశాంక్ వెంటనే స్పందించి మానవతా దృక్పథంతో బాన్సువాడ పట్టణ బిజెపి అధ్యక్షులు తుప్తి శివప్రసాద్ చేతుల మీదుగా మృతుని కుటుంబ సభ్యులకు రూ.5000 ఆర్థిక సహాయం అందింపజేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు.. అనంతరం ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆర్థిక సహాయం అందించినందుకు గాను మృతుని కుటుంబ సభ్యులు బిజెపి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, బిజెపి నసురుల్లాబాద్ మండల అధ్యక్షులు సున్నం సాయిలు, రుద్రూర్ మండల అధ్యక్షులు హరి, బీజేవైఎం ఉపాధ్యక్షులు విశాల్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి సాయికుమార్, ప్రమోద్, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india