V1News Telangana

best news portal development company in india

ప్రజలు లేకుండా జరిపిన పర్యావరణ ప్రజ అభిప్రాయ సేకరణ రద్దు చేయాలి ///  ప్రభావిత గ్రామాల డివిజన్ ప్రజల సమక్షంలో జరుపాలి

SHARE:

ప్రజలు లేకుండా జరిపిన పర్యావరణ ప్రజ అభిప్రాయ సేకరణ రద్దు చేయాలి

ప్రభావిత గ్రామాల డివిజన్ ప్రజల సమక్షంలో జరుపాలి

ఎన్టీపీసీ ప్రజాభిప్రాయ సేకరణకు నిరసనగా అఖిల పక్ష జే.ఏ.సి ఎర్పాటు

రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం జనవరి 30:-

ప్రజలు లేకుండా జరిపిన పర్యావరణ ప్రజ అభిప్రాయ సేకరణ రద్దు చేయాలి ప్రభావిత గ్రామాల డివిజన్ ప్రజల సమక్షంలో జరుపాలని రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అధ్యక్షతన గురవారం సిరి ఫంక్షన్ హాల్లో ఎన్టీపీసీ ప్రజాభిప్రాయ సేకరణకు నిరసనగా అఖిల పక్ష జే.ఏ.సి ఎర్పాటు చేశారు. ఈ సందర్భంగా చందర్ మాట్లాడుతూ రామగుండంలో ఎన్టీపీసీ ఉత్పత్తి నుండి ఇప్పటికే వెలువడుతున్న కాలుష్యం తో ప్రజల ప్రాణాలు పోతున్నాయన్నారు. ఎన్టీపీసీ 2400 మెగావాట్ల ప్రాజెక్టు నిర్మాణం తప్పనిసరి అయుతే సోలార్ ద్వారా నిర్మాణం చేసుకోవాలన్నారు. ఎన్టీపీసీ ప్రజాభిప్రాయ సేకరణకు నిరసనగా అఖిల పక్ష జే.ఏ.సిలో బిఆర్ఎస్ పార్టీ నుండి కోరుకంటి చందర్ బిజేపి నుండి బల్మూరి అమరేందర్ రావు న్యూడెమాక్రసి ఈ.నరేష్ బిఎస్పి ఇరికిల్ల శంకరయ్య టి.డి.పి దామెదర్ రెడ్డి న్యూ ఇండియా పార్టి జె.వి.రాజు సి పి ఐ ఎం ఎం ఎల్  మాస్ లైన్ జూపాక శ్రీనివాస్ తోకల రమేష్ పర్యావరణ పరిరక్షణ వేదిక ఉమ మహేశ్వర్ రావు ఎన్ సి పి మేకల శ్రీధర్ మాజీ కార్పోరేటర్లు కుమ్మరి శ్రీనివాస్ కల్వచర్ల కృష్ణ వేణీ నాయకులు నారాయణదాసు మారుతి బుర్ర శంకర్ గౌడ్ పాల్గొన్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india