V1News Telangana

best news portal development company in india

భక్తులతో కిక్కిరిసిపోయిన అల్లమా ప్రభు జాతర….

SHARE:

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని బొమ్మందేవ్ పల్లి గ్రామ శివారులో కొండపై వెలసిన స్వయంభు లింగం అల్లమా ప్రభు జాతర ఉత్సవాలు రెండవ రోజులో భాగంగా చుట్టుపక్కల గ్రామాల మరియు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాతర పరిసరాలు ఎటు చూసినా జనంతో కిక్కిరిసిపోయి దర్శనమిచ్చారు. దుకాణ సముదాయాలు మరియు చిన్నపిల్లలకు ఆట వస్తువులు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించాయి. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ సభ్యులు అన్ని మౌలిక వసతులు కల్పించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు వారి కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి వనభోజనాలు నిర్వహించుకున్నారు. మూడవరోజు శుక్రవారం కుస్తీ పోటీలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కుస్తీ పోటీలో పాల్గొనడానికి చుట్టుపక్కల గ్రామాలతో పాటు మహారాష్ట్ర , కర్ణాటక నుండి మల్ల యోధులు పాల్గొంటారని.. కుస్తీ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతాయని తెలియజేశారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india