V1News Telangana

best news portal development company in india

ఘనంగా ప్రారంభమైన అల్లమా ప్రభు జాతర ఉత్సవాలు….

SHARE:

కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని బొమ్మన్దేవ్ పల్లి గ్రామ శివారులో కొండపై వెలసిన స్వయంభు లింగం అల్లమా ప్రభు జాతర బుధవారం రోజు ఘనంగా ప్రారంభమైంది. మాఘమాసం అమావాస్య రోజున రాత్రి 12 గంటలకు దేవాలయ కమిటీ సభ్యులు అగ్నిగుండం నిర్వహించారు. భక్తులు ఆనవాయితీగా నిర్వహించే అగ్నిగుండం ప్రవేశం చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజామున భక్తుల కొరకు అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. అన్న ప్రసాద వితరణ మూడు రోజులపాటు కొనసాగుతుందని తెలిపారు. గురువారం రోజు రథోత్సవం మరియు జాతర ఉంటుందని తెలిపారు. శుక్రవారం రోజు కుస్తీ పోటీలు నిర్వహించిన తర్వాత ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india