V1News Telangana

best news portal development company in india

భూమి కబ్జాకు గురైందని సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బాధితురాలు….

SHARE:

కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణ శివారులో గల వారాంతపు సంత సమీపంలో గల భూమి సర్వే నెంబరు 787/2 గలది ఒక్క ఎకరం 20 గుంటల భూమిని కబ్జా చేశారని బాధితురాలు ఒట్లం గారి నాగవ్వ బుధవారం రోజు సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టిని కలిసి ఫిర్యాదు చేశారు. తన భూమిని కబ్జా చేసిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొని తన భూమిని తనకు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంలో ఆమెతోపాటు బిజెపి అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, సీనియర్ నాయకులు శంకర్ గౌడ్, కోణాల గంగారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india