కామరెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట్ పోలీస్ స్టేషన్లో ఎస్ ఐ గా విధులు నిర్వహిస్తున్న సుధాకర్ బుధవారం రోజు ఏసీబీ అధికారులు పన్నిన వలలో చిక్కారు. వాహనాలు అమ్మకాలు, కొనుగోలు చేసే ఓ వ్యాపారి నుండి ఒక్కో వాహనానికి రూ.12 వేల రూపాయలు లంచం అడగడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. నిజామాబాద్ పట్టణంలోని రుక్మిణి చాంబర్ ప్రాంతంలో బాధితుడి నుండి ఎస్సై రూ.12500 తీసుకుంటుండగా పన్నాగం పన్నిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గత రెండు నెలల క్రితం ఇదే పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన ఎస్సై ఏసీబీ అధికారులకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ప్రభుత్వం నుండి జీతభత్యాలు పొందుతూ ప్రజల వద్ద నుండి లంచాలు తీసుకుంటూ అధికారులు అక్రమ ఆస్తులు కూడ పెడుతున్నారంటూ పోలీసుల పనితీరుపై పలువురు ప్రజలు విమర్శిస్తున్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








