– హిందూ ధర్మ రక్షణ సంఘాల ఆకాంక్ష
కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: ఆలయాల పరిరక్షణ కొరకు.. హిందువులలో ఐక్యత పెంపొందించడానికి గురువారం రోజు నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో గల రామ మందిరంలో హిందూ ధర్మ పరిరక్షణ సంఘాల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రసాద్ పటేల్ పాల్గొంటారని తెలిపారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా హిందూ బంధువులలో ఐక్యతను నింపడానికి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ఆలయాలను మనమే రక్షించుకుందామని ఈ సమావేశానికి హిందువులందరూ అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఆలయాలను మరియు ఆలయాలకు సంబంధించిన భూములు కబ్జాదారుల కబంధహస్తాల నుండి విడిపించుకుందామని పిలుపునిచ్చారు. ఎంతో చరిత్ర కలిగిన ఆలయాలు , వాటి భూములు అన్యాక్రాంతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన ధర్మానికి ఆయువు పట్టు లాంటి ఆలయాల పరిరక్షణ హిందువుల ఐక్యతతోనే సాధ్యమని.. ఆలయాల పరిరక్షణ కొరకు పాటుపడిన చత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకొని అందరము సంఘటితంగా కలిసి పోరాడుదామని సూచించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హిందూ బంధువులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి.. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు నిలయాలుగా విరాజిల్లుతున్న దేవాలయాల సంరక్షణకు అందరూ కంకణం కట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








