– అరకొరగా క్రీడా ప్రాంగణాలు, జాడ లేని ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు
– అర్హత లేని ఉపాధ్యాయులతో విద్యాబోధన
– ప్రత్యేక తరగతులు, పరీక్ష , ఆటల ఫీజులు అంటూ అధికంగా డబ్బులు వసూళ్లు
– ఫీజుల భారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు
– వేద వాహిని, మాణిక్ ప్రభు ప్రైవేట్ పాఠశాల ల యాజమాన్యాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి
– ప్రేక్షక పాత్ర వహిస్తున్న సంబంధిత శాఖ అధికారులు
– ( A.I.S.B), (B.C.V.C) విద్యార్థి సంఘాల నాయకులు బైరాపూర్ రవీందర్ గౌడ్ , దత్తు డిమాండ్
కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: జుక్కల్ మండలంలోని పెద్దగుల్ల గ్రామంలో గల వేద వాహిని, మాణిక్ ప్రభు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు “ఎవరికి వారే యమునా తీరే”అన్న చందంగా నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలను నిర్వహిస్తున్నారని.. ఇష్టానుసారంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని బుధవారం రోజు (A.I.S.B) ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ మరియు (B.C.V.S) ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దత్తు జుక్కల్ మండల ఎంఈఓ తిరుపతయ్యకు వినతి పత్రం అందజేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేదవాహిని మరియు మాణిక్ ప్రభు ప్రైవేట్ పాఠశాలల్లో అర్హులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన చేపట్టడం లేదని.. కేవలం ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణులు కానీ సిబ్బందితో విద్యాబోధన కొనసాగిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతూ.. వ్యాపారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ పాఠశాలల్లో పిల్లలు ఆడుకోవడానికి క్రీడా ప్రాంగణాలు కూడా అర కొరగా ఉన్నాయని.. ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు ఏమాత్రం పాటించడం లేదని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రత్యేక తరగతులు, పరీక్షా ఫీజులు, ఆటల ఫీజులు వీటికి తోడు బస్సుల ఫీజులు అంటూ విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని వాపోయారు. గతంలో కూడా ఈ పాఠశాలలపై పలుమార్లు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఇంత జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు.. ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు సత్వరమే స్పందించి ఈ రెండు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకొ ని వాటి గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల (A.I.S.B) ,(B.C.V.S) విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు ఉదృతం చేసి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








