V1News Telangana

best news portal development company in india

డా. కేర్ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు….

SHARE:

– సిబ్బందికి, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహణ, మందుల పంపిణీ

– వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన

– మెరుగైన వైద్యం తీసుకోవాలని సూచనలు

– పారిశుద్ధ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని హెచ్చరిక

– డా. కేర్ సంస్థ CMD, Dr.AM రెడ్డి సూచనలు

హన్మ కొండ ప్రతినిధి:

హన్మ కొండ జిల్లా: హన్మ కొండ పట్టణ కేంద్రంలో గల కాకతీయ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో బుధవారం రోజు డా. కేర్ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య హోమియోపతి శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్యులు , డా. కేర్ సంస్థ CMD, డా.AM.రెడ్డి, డా. డేవిడ్ , డా. నిఖిల్ వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.. మెరుగైన వైద్యం తీసుకోవాలని సూచనలు చేశారు. ఈ క్రమంలో కళాశాల సిబ్బంది ప్రధానోపాధ్యాయులు, ప్రొఫెసర్లు, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ CMD డా.AM రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. పరిశుభ్రత మరియు తాజాగా, వేడిగా ఉండే ఆహార పదార్థాలను భుజించాలని సూచనలు చేశారు. ఏదైనా వ్యాధి ప్రాథమిక దశలో ఉన్నప్పుడే నిర్లక్ష్యం వహించకుండా వెంటనే మెరుగైన వైద్యాన్ని తీసుకోవాలని తెలిపారు. ఇంటి పరిసరాలు, కళాశాల పరిసరాలను మరియు మూత్రశాలలు మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని దోమలు అధికంగా వ్యాపించడం వల్ల ప్రజలు అనేక రకాల వ్యాధుల బారిన పడి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది, విద్యార్థులు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు డా. కేర్ సంస్థ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో PRO శంకర్ సింగ్, ఫార్మసిస్ట్ తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india