V1News Telangana

best news portal development company in india

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

SHARE:

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

 

 

 

 

 

 

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం/పెద్దపల్లి, జనవరి- 27:

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం బాధ్యతలు స్వీకరించారు.రామగుండం నగర కార్పొరేషన్ పాలకవర్గం కాలపరిమితి జనవరి 26 ,2025 న ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ పెద్దపల్లి ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు జిల్లా కలెక్టర్ సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్లో రామగుండం నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా రామగుండం ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణ శ్రీ , రామగుండం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india