V1News Telangana

best news portal development company in india

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు….

SHARE:

– జాతీయ పతాక ఆవిష్కరణ

– నిర్వహించిన తెలంగాణ వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి

కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 76 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం రోజు నియోజకవర్గ శాసనసభ్యులు, తెలంగాణ వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధులు వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బ్రిటిష్ వారితో పోరాడిన ఫలితంగా భారతీయులందరూ గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26వ తేదీన జరుపుకుంటున్నామని అన్నారు. వారి పోరాటాల ఫలితంగానే ఈరోజు ప్రజలందరూ స్వేచ్ఛ సమానత్వంతో భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా త్యాగధనులందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india