V1News Telangana

best news portal development company in india

సంక్షేమ పథకాల ధ్రువపత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేసిన అధికారులు….

SHARE:

కామరెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ నియోజకవర్గంలోని నసుల్లాబాద్ మండలం రాముల గుట్ట తండా గ్రామపంచాయతీ పరిధిలో ఆదివారం రోజు రాష్ట్ర ప్రభుత్వం అమలుపరిచిన నాలుగు సంక్షేమ పథకాలు “రైతు భరోసా”, “ఇందిరమ్మ ఇల్లు”,” రేషన్ కార్డుల జారీ”, “ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,” తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన ధ్రువపత్రాలను లబ్ధిదారులకు అందించి ప్రారంభించారు. అనంతరం మండల ప్రత్యేక అధికారి దయానంద్, తహసిల్దార్ ఎల్ .ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో సూర్యకాంత్, ఆర్ ఐ సాయిలు, ఐసిడిఎస్ సూపర్వైజర్ వాణి,ఎస్సై లావణ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india