V1News Telangana

best news portal development company in india

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు….

SHARE:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని మరియు విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు. అనంతరం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వారి ప్రతిభకు బహుమానంగా నగదు పురస్కారాలు మరియు బహుమతులు అందజేశారు. అదేవిధంగా పదవ తరగతి విద్యార్థులకు వారు క్రమశిక్షణతో బాగా చదువుకొని మంచి ఫలితాలు సాధించే విధంగా ప్రోత్సహించే క్రమంలో వారికి నగదు పురస్కారాలు బిఆర్ఎస్ పార్టీ తరపున ప్రథమ బహుమతి రూ.5000, ద్వితీయ బహుమతి రూ.3000, తృతీయ బహుమతి రూ.2000 అందజేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా మండల నాయకులు గొడిసెల నర్సింలు గౌడ్, టేకుర్ల సాయిలు మాట్లాడుతూ ఆటపాటలలో విద్యార్థులు కనబరిచిన ప్రతిభను అభినందించారు. ఆటపాటలతోపాటు చదువులో కూడా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకున్నారు. చదువు ప్రతి విద్యార్థికి గొప్ప వరమని అన్నారు. ఉన్నత విద్యను అభ్యసించడం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని కష్టపడి చదివి పాఠశాలకు, గ్రామానికి, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు గొప్ప పేరు సంపాదించి పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చందర్, గునిగెరి హన్మండ్లు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మోసిన్, మంగలి సాయిలు, చుంచు శేఖర్, దేశ్పాక్ సాయిలు, దొంతి భాస్కర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india