– నాలుగు సంక్షేమ పథకాల ప్రారంభోత్సవం
– లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేత
– రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ నియోజకవర్గం లోని నసురుల్లాబాద్ మండలం రాముల గుట్ట తండా గ్రామపంచాయతీ పరిధిలో మరియు వర్ని మండలంలోని మల్లారం గ్రామంలో ఆదివారం రోజు కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో భాగంగా నాలుగు సంక్షేమ పథకాలను ఆదివారం రోజు రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతికి కట్టుబడి ఉందని అన్నారు. నసురుల్లాబాద్ మండలంలోని రాముల గుట్ట తండాలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి నిరుపేద కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుందని కొనియాడారు. అందులో భాగంగానే రైతులకు” రైతు భరోసా”,రైతు కూలీలకు “ఇందిరమ్మ ఆత్మీయ భరోసా” నిరుపేదలు కడుపునిండా భోజనం చేయడానికి “రేషన్ కార్డుల” పంపిణీ అదేవిధంగా ప్రతి నిరుపేద కుటుంబం ఆత్మగౌరవంతో నివసించడానికి “ఇందిరమ్మ ఇళ్ల” పంపిణీ కార్యక్రమం చేపట్టిందన్నారు. అందులో రాముల గుట్ట గ్రామాన్ని నేడు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా పరిగణలోకి తీసుకొని సంక్షేమ పథకాలను ప్రారంభించామన్నారు.

ఒక్క రాముల గుట్ట గ్రామంలోనే 126 మంది లబ్ధిదారులకు సంవత్సరానికి ఎకరానికి రూ.12000 చొప్పున “రైతు భరోసా” లను, 39 మంది లబ్ధిదారులకు “ఇందిరమ్మ ఇళ్ల”ను 27 మందికి కొత్త “రేషన్ కార్డు”లను “ఇందిరమ్మ ఆత్మీయ భరోసా”పథకంలో భాగంగా 24 మంది రైతు కూలీలకు ఏడాదికి రూ.12,000 చొప్పున పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలోనూ ఈ పథకాలను అమలయ్యే విధంగా అధికారులు చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి, మండల ప్రత్యేక అధికారి దయానంద్, తహసిల్దార్ ఎల్. ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో సూర్యకాంత్, ఐసిడిఎస్ సూపర్వైజర్ వాణి, ఉమ్మడి మండలాల ఏఎంసీ చైర్మన్ దుర్గం శ్యామల, మాజీ ఏఎంసీ చైర్మన్ పెరిక శ్రీనివాస్, మాజీ ఎంపీపీ పాల్త్య విట్టల్ , మాజీ ఎంపిటిసి కంది మల్లేష్, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








