– అధికారంలోకి రాకముందు నేతాజీ విషయంలో నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు మరిచాడు
– సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలి
– బ్రిటీష్ సైన్యంతో వీరోచిత పోరాటం చేసిన ధైర్యశాలి నేతాజీ
– నేతాజీ గురించి మాట్లాడే నైతిక హక్కు బిజెపి ప్రభుత్వం కోల్పోయింది
– AIFB జిల్లా ప్రధాన కార్యదర్శి,గొల్లపల్లి రాజుగౌడ్
నిజామాబాద్ జిల్లా : జనవరి 23 న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కావున ఈ రోజును జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజు గౌడ్ డిమాండ్ చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB)నిజామాబాద్ జిల్లా కమిటీ,ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజుగౌడ్ మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటిస్తూ,”దేశ్ ప్రేమ్ దివాస్” గా నిర్వహించాలని డిమాండ్ చేశారు.నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు ఎన్నికల వాగ్దానంలో అధికారంలోకి వస్తే నేతాజీ జయంతిని అధికారికంగా నిర్వహించడంతోపాటు, ఆయన మరణానికి సంబంధించిన రహస్య పత్రాలను (సీక్రెట్ ఫైల్స్) ని బయటపెడతామని హామీ ఇచ్చి నేటికి పది సంవత్సరాలు గడిచిపోతున్న ఇప్పటివరకు ఆ రహస్య పత్రాలను బయటకు తీసుకురాక పోగా, జాతీయ సెలవు దినంగా కూడా ప్రకటించే పరిస్థితిలో లేరని మండిపడ్డారు.నేతాజీ గురించి మాట్లాడే నైతిక అర్హత కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు.భారతదేశ దాస్య శృంఖలాలను తెంచడానికి బ్రిటిష్ ముష్కర మూకలతో వీరోచితమైన పోరాటం నిర్వహించడమే కాకుండా,దేశ యువతను తన సైన్యంగా ఏర్పాటు చేసుకొని స్వాతంత్రం కొరకు అలుపెరుగని పోరాటం చేసిన సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని,ఆయన పోరాటానికి కేంద్ర ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జవారే రాహుల్,బైరాపూర్ రవీందర్ గౌడ్,నగేష్,ఆనంద్, శ్రీకాంత్ కుమార్, బాలు నాయక్, శివ గౌడ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








