Post Views: 8
కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామ శివారులో కొండపై వెలసిన తెలంగాణ తిరుమల దేవస్థానం లో శుక్రవారం రోజు మహమ్మద్ నగర్ గ్రామానికి చెందిన ముప్పిడి శ్రీనివాస్ తండ్రి పేరు దుర్గయ్య కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు 573 గ్రాములు వెండితో రూపొందించిన “అభయ హస్తం”ముద్రికను స్వామివారికి కానుకగా బహుకరించారు.
అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి .. వారిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆలయ కమిటీ సభ్యులు వెంకట నరసరాజు, ఆలయ ప్రధాన అర్చకులు నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..