మన v1newstelangana నిఘానేత్రంలో వెలుగు చూసిన ఇసుక దొంగల బండారం..
, *నిజామబాద్ జిల్లా పొతంగల్ మండలం లో కూడా ఇదే పరిస్థితి రాత్రి సమయంలో విచ్చలవిడిగా మంజీరా వాగులో జెసిపిలు, వార్తలు కథనానికి విలేకరులకు దాడిలు కూడా చేస్తున్నారు ఇసుక మాఫిదారులు, పోతంగల్ మండల్ లో ఇద్దరు వ్యక్తులను ఇస్కాక్రమ దాడులు ఇక్కడ ఉన్న కోటగిరి పోలీస్ ఉన్నత అధికారి వాళ్లకు ఫుల్ సపోర్ట్ గా ఉంది ఏదో సోషల్ మీడియాలో వైరల్ అయిందని పేపర్లో వార్తలు వచ్చినన్ని కక్షగట్టి విలేకరులపై దాడులు చేస్తున్న ఇద్దరు వ్యక్తులు పొతంగల్ గ్రామంలో**
సార్….. మంజీరా మిక్సింగ్ ప్లాంట్ వద్ద అర్ధరాత్రి అక్రమంగా ఇసుక టిప్పర్లలో నింపి కర్ణాటకకు తరలించడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ, మన దినపత్రిక రాష్ట్ర ప్రతినిధి ద్వారా100 డయల్ కు ఫోన్ వెళ్ళింది..
ఎక్కడ ఇసుక టిప్పర్లు నింపారు అంటూ పైనుంచి మన దినపత్రికకు ప్రతినిధికి ఫోన్…
సార్.. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం
బీర్కూర్ మంజీరా నది మిక్సింగ్ ప్లాంట్ వద్ద డంపు చేసిన ఇసుకను టిప్పర్లలో నింపి తరలించడానికి ప్రయత్నం సాగుతుంది…
ఒక్క నిమిషం ఆగండి… మీతో బీర్కూర్ పోలీసులు మాట్లాడుతారు..
హలో.. ఎవరు మీరు? అంటూ బీర్కూర్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ ..
సార్..
కానిస్టేబుల్ నుంచి ఫోన్.,… ఎక్కడ ఇసుక నింపారు, ఆ లారీలు ఎక్కడ ఉన్నాయి? అంటూ ప్రశ్న
సార్…
మంజీరా మిక్సింగ్ ప్లాంట్ వద్ద బీర్కూర్ ప్రధాన రహదారి కి 100 మీటర్ల దూరంలో. 
కానిస్టేబుల్ ఫోన్…. రోడ్డుమీదికి వస్తనే పట్టుకుంటాం.. మిక్సింగ్ ప్లాంట్ వద్ద ఉంటే పట్టుకునే అధికారం మాకు లేదు.. ఏ ఆపద వచ్చినా, ఎక్కడన్నా అక్రమాలు జరిగిన, 100 డయల్ కు ఫోన్ చేస్తే మీ సమస్యలకు పరిష్కారం అంటూ ఉన్నత అధికారుల ఆదేశాలు. కానీ అర్ధరాత్రి డంపు చేసిన ఇసుకను టిప్పర్లలో నింపి కర్ణాటక, మహారాష్ట్రకు తరలిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.. ఈ విషయంలో 100 డయల్ పోలీస్ ఏమి చేయలేకపోయారు.. కారణం ఆ ఇసుక టిప్పర్లు ఎస్ కే ఎస్ కంపెనీ కి చెందిన వి. వీటిని పట్టుకునే అధికారం రాష్ట్రంలో ఎవరికి కూడా లేదు. ఎందుకంటే ఈ కంపెనీకి గత గులాబీ ప్రభుత్వంలో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు, అధికారుల అండదండలు ఉన్నాయి. ఇప్పటికీ ఆ కంపెనీ నిర్వాహకులు, ఒకవైపు అభివృద్ధి పేరిట అర్ధరాత్రి పూట అక్రమ ఇసుక దందా కొనసాగిస్తున్నారు. మాటతో వినని వారికి… మూటలతో సర్ది చెప్పి ఇసుక దందా సాగిస్తున్నారు అనడానికి రాత్రి జరిగిన ఇసుక తరలింపే నిదర్శనం..
ఇక అసలు విషయానికి వద్దాం …
2021 జనవరిలో బీర్కూర్ మంజీరా పర్యాయక ప్రాంతంలో భూగర్భ జలాలు తగ్గకుండా బోర్లపై ఆధారపడి జీవిస్తున్న అన్నదాతలను ,ఆదుకోవడానికి 28 కోట్ల రూపాయలు వెచ్చించి చెక్ డ్యామ్ మంజూరు చేశారు ,అప్పటి గులాబీ ప్రభుత్వం లోని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి. భూమి పూజ సందర్భంగా ఏడాది కాలంలో ఈ చెక్ డాం నిర్మాణం పూర్తి చేయాలంటూ, ఇరిగేషన్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇటు పాలకులు గానీ, అటు అధికారులు గానీ స్పందించకపోవడం కాంట్రాక్టర్కు బడా నేతల హస్తం ఉండడం వల్ల ,నిర్మాణం పనులు ఏడాదిలో పూర్తి చేయవలసి ఉండగా ఏడాదికి కొంత పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. చెక్ డాం నిర్మాణం పనుల కోసం మంజీరా ఒడ్డున మిక్సింగ్ ప్లాంట్ వేశారు. ఈ మిక్సింగ్ ప్లాంట్ ఉద్దేశం ఏమిటంటే , చెక్ డ్యామ్ నిర్మాణం పనులకు కావలసిన సిమెంటు ,కంకర మిక్సింగ్ చేసుకొని వాడుకోవాలని నిబంధన ఉంది. ఇది ఎస్ కె ఎస్ అనే ఒక కంపెనీకి ఈ చెక్ డాం పనులు అప్పగించారు . ఆ కంపెనీకి బడా నేతల అండదండలు, ఆర్థిక బలం ఉండడంతో అన్ని శాఖల అధికారులు , ఆ కంపెనీ కి గులాములయ్యారు. ఆ కంపెనీ యజమాన్యం ఏ విధంగా చెప్తే ,ఆ విధంగా సంబంధిత శాఖ అధికారులు అందరూ పనిచేస్తున్నారు. కానీ చెక్ డాం నిర్మాణం పనుల కోసం ఏర్పాటు చేసుకున్నా మిక్సింగ్ ప్లాంట్ లో కేవలం చెక్ డాం నిర్మాణం పనుల కోసమే ఇది వాడుకోవాల్సి ఉండగా. నాలుగేళ్లుగా ఉచితంగా ఇసుకను ,మిక్సింగ్ ప్లాంట్ కు వాడుకుంటూ బాన్స్వాడ, ఎల్లారెడ్డి, బోధన్, జూకల్ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ఇక్కడి నుంచే ఇసుక, కంకర మిక్సింగ్ చేసి అక్కడికి తీసుకువెళ్లి అభివృద్ధి పనులు చేసుకుంటూ కోట్లు దండుకున్నారు. గ్రామపంచాయతీకి రావలసిన సినర్జీ చార్జీలు చెల్లించకుండానే అధికారుల అండదండలతో ఉచితంగా మంజీరా ఇసుకను అభివృద్ధి పనులకు వాడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మిక్సింగ్ ప్లాంట్ నిర్వాణ చేస్తూ, మరొకపక్క భారీ ఎత్తున అభివృద్ధి పనులకు అక్రమంగా ఇసుక వాడుకున్నారు అయినప్పటికీ ఏ అధికారి, శాసనసభాపతి, మౌనంగా ఉండిపోయారు. ఎవరెవరికి ఎంతెంత నెలనెల.పుట్టాల్సిందో అంతా ముడుపులు ముట్ట చెప్పి అక్రమ ఇసుక దందకు తెర లేపారు. అభివృద్ధి పేరిట కోట్లు దండుకున్నారు
గురువారం అర్ధరాత్రి ఏం జరిగింది? ..
బీర్కూర్ మంజీరా నదిలో నెలరోజుల నుంచి చెక్ డాం నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. వీటికోసం మిక్సింగ్ ప్లాంట్ వద్ద వేలాది క్యూబిక్ మెట్రిక్ టన్నుల ఇసుక డంపు చేసుకున్నారు. పక్కనే మంజీరా నది ఉండగా, అక్కడినుంచి ప్రతిరోజు కావలసిన ఇసుక తీసుకువచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ఆ దారి కి వెళ్లకుండా, పగలు పూట జెసిబి లతో భారీగా ఇసుక డంపు, మిక్సింగ్ ప్లాంటు వద్ద ఎస్ కె ఎస్ కంపెనీ నిర్వాకులు వేస్తున్నారు. భారీగా వేసిన ఇసుక డంపు నుంచి రాత్రి వేళలో కర్ణాటక, మహారాష్ట్ర కు తరలి వెళ్ళిపోతుందని మన దినపత్రిక రాష్ట్ర ప్రతినిధికి సమాచారం అందడంతో. వారం రోజులుగా మంజీరా నది వద్ద మన దినపత్రిక రాష్ట్ర ప్రతినిధి బృందం నిఘ వేసింది. ఊహించిన విధంగానే మంజీరా మిక్సింగ్ ప్లాంట్ వద్ద నుంచి రాత్రి వేళలో 50 నుంచి 60 టన్నుల ఇసుక టిప్పర్లలో నింపి కర్ణాటక, మహారాష్ట్రకు తరలిస్ వైనం వెలుగుచూస్తుంది. గురువారం అర్ధరాత్రి మన దినపత్రిక రాష్ట్ర ప్రతినిధి బీర్కూర్ మంజీరా మిక్సింగ్ ప్లాంట్ వద్ద పగలు భారీ ఎత్తున డంపింగ్ చేసిన ఇసుకను అర్ధరాత్రి ఇసుక దొంగలు జంపు చేస్తున్న విషయం బయటపడింది. అక్కడ తరలించడానికి రెండు టిప్పర్లు భారీగా లోడుతో నింపి ఉన్నాయి.
వాటిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుండగా , మన దినపత్రిక రాష్ట్ర ప్రతినిధి అక్కడికి వెళ్లడంతో టిప్పర్లను వదిలివేసి డ్రైవర్లు పారిపోయారు. జెసిబి డ్రైవర్ మాత్రం అక్కడే ఉండిపోయారు. జెసిబి డ్రైవర్ల ప్రశ్నించగా కర్ణాటక ప్రాంతంలో సాగుతున్న పనులకు ఇక్కడి నుంచి రాత్రిపూట ఇసుక తీసుక వెళుతున్నట్లు వెల్లడించారు. ప్రతిరోజు 10 టిప్పర్ల ఇసుక అక్రమంగా అర్ధరాత్రి వేళలో కర్ణాటకకు, మహారాష్ట్రకు తరలిపోతుంది. రోజుకు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఈ ఇసుక దొంగల ఆదాయం అక్రమ ఇసుక దందా వల్ల సమకూర్తుంది. చెక్ డ్యామ్ పేరిట మిక్సింగ్ ప్లాంట్ వద్ద పగలు వేసిన ఇసుక డంపులు… అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు అక్రమ ఇసుక దందా కొనసాగిస్తున్నారు ఇసుక దొంగలు.. అయినప్పటికీ ఏ అధికారి కూడా ఈ అక్రమ ఇసుక దందా అరికట్ట లేకపోవడంతో విచ్చలవిడిగా మంజీరా నదిని ఇసుక కోసం కొల్లగొడుతున్నారు…
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








