– వాకిళ్లలో రంగవల్లుల సమాహారం
– గాలిపటాలతో చిన్నారులు,యువకులు, పెద్దల కోలాహలం
– ఘుమఘుమలాడే పిండి వంటల రుచులు
కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని ఆయా గ్రామాలలో ప్రజలు మంగళవారం రోజు సంక్రాంతి పండగను అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ క్రమంలో మహిళలు, చిన్నారులు వేకోవజామునే నిద్ర మేలుకొని పుణ్య స్నానాలు ఆచరించి, నూతన వస్త్రాలను ధరించారు. వాకిళ్లను శుభ్రం చేసుకొని..కల్లాపి చల్లి ఎంతో ఆసక్తిగా రంగవల్లులను అందంగా అలంకరించారు. వివిధ రకాల రంగులను ఉపయోగిస్తూ ముగ్గులను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు.
చిన్నారులు సైతం ముగ్గులు వేయడానికి ఆసక్తికరపరిచారు. పండగ యొక్క విశిష్టతను రంగవల్లులలో ప్రతిబింబించేలా చిత్రించారు.గ్రామాలలో అందమైన రంగవల్లులతో తెలుగు లోగిల్లు శోభాయ మానంగా.. పండగ కలను సంతరించుకున్నాయి.
ప్రజలందరూ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని రకరకాల పిండి వంటలను ప్రత్యేకంగా తయారు చేసుకుని ఆస్వాదించారు. దీనిలో భాగంగా చిన్నారులు, యువకులు, పెద్దలు ఎంతో ఉత్సాహంగా గాలిపటాలను ఎగురవేస్తూ దర్శనమిచ్చారు.
పెద్దవాళ్లు వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉత్సాహంగా గాలిపటాలను ఎగురవేశారు. వేసుకుంటూ ఈ క్రమంలో వన్ష్ కీర్తన్ గౌడ్, సన్హిత్ గౌడ్, మోక్షజ్ఞన్ గౌడ్, ఆధ్యాన్ష్ గౌడ్, సాత్విక్ గౌడ్, అనే సోదరులు వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపిన దృశ్యాలు కెమెరాకు చిక్కాయి.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..