V1News Telangana

best news portal development company in india

జన్మభూమి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు…..

SHARE:

– ఉత్సాహంగా ముగ్గుల పోటీలలో పాల్గొన్న మహిళలు

– ఆటపాటలతో,అలరించిన చిన్నారులు

– ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలంగాణ వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి

– నియోజకవర్గ ప్రజలకు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు

బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బీర్కూరు మండలంలోని రైతు నగర్ గ్రామంలో సోమవారం రోజు జన్మభూమి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్ రాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండగ సందర్భంగా నిర్వహించిన పలు కార్యక్రమాలను వీక్షించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని రంగురంగుల రంగవల్లులతో అందంగా అలంకరించారు. ముగ్గుల పోటీలలో పాల్గొని విజేతలుగా నిలిచిన మహిళలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు ముందస్తుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. భగవంతుడి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలు సమృద్ధిగా పండి ఆనందంగా జీవించాలని కోరుకున్నారు. యువకులు పండగ సందర్భంగా గాలిపటాలను తగు జాగ్రత్తలు తీసుకుంటూ.. ముఖ్యంగా చైనా మాంజాను వినియోగించకుండా.. పండుగను నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీర్కూర్ మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india