V1News Telangana

best news portal development company in india

ఘనంగా ప్రారంభమైన బడా పహాడ్ ఉరుస్ ఉత్సవాలు….

SHARE:

– హజ్రత్ సయ్యద్ షాదుల్లా హుస్సేని బాబా గంధం ఊరేగింపు

– ముఖ్య అతిథిగా పాల్గొన్న వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి

నిజామాబాద్ ప్రతినిధి:

నిజామాబాద్ జిల్లా: బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండల పరిధిలో గల జలాల్ పూర్ గ్రామ శివారులో గల ప్రముఖ పుణ్యక్షేత్రం “హజ్రత్ సయ్యద్ షాదుల్లా హుస్సేని”బాబా దర్గా ( బడా పహాడ్ ) లో మూడు రోజులపాటు జరిగే ఉరుస్ ఉత్సవాలు శనివారం రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి విచ్చేసిన భక్తులు తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ క్రమంలో జలాల్పూర్ గ్రామంలో నిర్వహించిన” గంధం”ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బడా పహాడ్ పుణ్యక్షేత్రం చాలా ప్రసిద్ధిగాంచిందని అన్నారు. ఇక్కడికి పురుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తమ మొక్కలను తీర్చుకుంటారని తెలిపారు. కోరిన కోరికలు తీర్చే దేవుడిగా షాదుల్లా హుస్సేనీ బాబా భక్తులకు కొంగుబంగారంగా నిలిచారని కొనియాడారు. మతాలకు అతీతంగా హిందువులు, ముస్లింలు అందరూ కలిసి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. అనంతరం ఆయన బడా పహాడ్ దర్గా పరిసరాలలో సంచరిస్తూ భక్తుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన మౌలిక వసతులను పరిశీలించారు.

అదేవిధంగా భక్తులకు అసౌకర్యం కలుగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వర్ని మండల మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా, వర్ని మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, మైనారిటీ సోదరులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india