ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించకుండా పాటించాలని తాము సురక్షితంగా ప్రయాణాలు చేసి గమ్యం చేరుకోవాలని బోధన్ ఎసిపి శ్రీనివాస్ ఇందూర్ మోడల్ ఉన్నత పాఠశాలల కరస్పాండెంట్ ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కొడాలి కిషోర్ కుమార్ లు అన్నారు.
శుక్రవారం రోజున బోధన్ పట్టణంలోని ఇందూర్ మోడల్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన జాతీయ రహదారి భద్రత మా సోత్సవాలలోభాగంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్లపై రహదారులపై ప్రయాణాలు చేసే ప్రజలు హెల్మెట్లు కచ్చితంగా ధరించాలని, కారులో ప్రయాణించేవారు సీటు బెల్టులు పెట్టుకోవాలని సూచించారు. మానవ తప్పిదాల వల్ల ప్రతి సంవత్సరం లక్షలాదిమంది మృత్యువాత పడుతున్నారని తెలిపారు. మైనర్లు ఎవరు కూడా లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదని అటువంటి వారికి జైలు శిక్ష. తోపాటు 25000 రూపాయల జరిమానా విధిస్తారని అన్నారు. వాహనాలు ఇతరులవి అయినట్లయితే వాహన యజమానికి కూడా శిక్ష పడుతుందని వివరించారు. వాహనాలు నడిపిస్తూ సెల్ఫోన్లో .మాట్లాడుతూ ముగ్గురు వాహనాలపై ప్రయాణిస్తూ అనేక ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలన్నారు. ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఇందూర్ మోడల్ పాఠశాలలో ఏర్పాటు చేసినందుకు పాఠశాల యాజమాన్యం వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్. పట్టణ సీఐ వెంకటనారాయణ. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామారావు .అడ్మినిస్ట్రేటివ్ ఇన్చార్జి స్వాతి. ఉపాధ్యాయులు బృందం. ట్రాఫిక్ .పోలీస్. రవాణా శాఖ.ల సిబ్బంది. విద్యార్థుల తల్లిదండ్రులు .విద్యార్థులు. పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








