నిజామాబాద్ జిల్లా: బోధన్ పట్టణ కేంద్రంలో కేటీఆర్ ఆదేశాల మేరకు గురువారం రోజు బిఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు ఖలీల్ సతీమణి, అయేషా ఫాతిమా ఆధ్వర్యంలో, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులతో కలిసి ఆందోళన చేపట్టి నిరసన తెలిపారు.
ఈ క్రమంలో వారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణ కేంద్రంలో గల ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఆయేషా ఫాతిమా మరియు బోధన్ పట్టణ అధ్యక్షులు రవీందర్ యాదవ్, డిసిసిబి డైరెక్టర్ గిర్ధవార్ గంగారెడ్డి వారి ఆధ్వర్యంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ఎన్నికల సందర్భంగా రైతులకు పంట పెట్టుబడి సహాయంగా “రైతు భరోసా” పథకాన్ని.. గత ప్రభుత్వం అమలుపరిచిన “రైతు బంధు” పథకానికి కొనసాగింపుగా రైతు భరోసా పేరుతో ఒక్క ఎకరాకు రూ .7500 చొప్పున ఏడాదికి రూ.15000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి ఈరోజు మాట మార్చడం రైతులను వంచించడమే అవుతుందని అన్నారు.అలాగే కౌలు రైతులకు,రైతు కూలీలకు కూడా పెట్టుబడి సహాయం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు రైతు భరోసా అమలు చేయకపోవడం బాధాకరమన్నారు,రైతు స్వీయ హామి పత్రం ఇచ్చిన తరువాతే రైతులకు రైతు భరోసా ఇస్తానని చెప్పడం రైతులను మోసం చేయడమేనని తెలిపారు.తెలంగాణ రైతులను ,ప్రజలను మోసం చేసే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని ఈ సందర్భంగా BRS పార్టీ తరపున డిమాండ్ చేశారు.తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతాంగానికి అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్న సుమారు 2,85,000 మంది రైతులకు ,బోధన్ నియోజక వర్గం పరిధిలోని సుమారు 55000 మంది రైతులకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం సంవత్సరానికి రూ.15000 ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలను అమలు చేస్తాం అని మభ్యపెట్టి అందరినీ మోసం చేస్తుందని దుయ్యబట్టారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటను నిలపెట్టుకోవాలని కోరారు, ఈ కార్యక్రమంలో నియోజక వర్గం మండల అధ్యక్షులు ,శ్రీరామ్,నరసన్న, భూమరెడ్డి,సంజీవ్ కుమార్, నరసింగరావు,ఎంపీపీ శ్రీనివాస్ ,మాజీ AMC చైర్ పర్సన్ వీర్ దేశాయ్ ,బెంజర్ గంగారాం,ఆశ్వక్,సీనియర్ నాయకులు రజాక్ ,రవికిరణ్ , సర్పంచ్ లు ఆకుల శ్రీనివాస్,రవి గౌడ్,నాయకులు నక్క లింగారెడ్డి,రవిశంకర్ గౌడ్,శంకర్ గౌడ్, అఫ్లూరి నరేష్ కుమార్,ప్రవీణ్ జాదవ్, ముబిన్ ఖాన్,అఖిల్,ఇతర నాయకులు వార్డ్ ఇంచార్జీ లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








