– సంరక్షణకు నోచుకోని చెరువులు
– రాళ్లు, మట్టితో నింపి ఆనవాళ్లు లేకుండా చేస్తున్న వైనం
– యదేచ్చగా, క్రమక్రమంగా స్వాహా చేస్తున్న భూ బకాసురులు
– చోద్యం చూస్తున్న సంబంధిత శాఖ అధికారులు
– బిజెపి పార్టీ పట్టణ అధ్యక్షులు తుప్తి శివప్రసాద్ ఆరోపణలు
బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలోని చెరువులన్నీ కబ్జాలకు గురవుతున్నాయని బుధవారం రోజు బిజెపి పార్టీ పట్టణ అధ్యక్షులు తుప్తి శివప్రసాద్ ఆరోపణలు చేశారు. చెరువులను రాళ్లు మరియు మట్టితో నింపి ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. పట్టణంలో గల ఎల్లయ్య చెరువును గతంలో వారాంతపు సంతకు స్థలం కేటాయించడానికి సగం మేరకు పూడ్చి వేశారని తెలిపారు. ఇప్పుడు కబ్జాదారులు బండరాళ్లు, మట్టితో చెరువును పూడ్చేస్తూ యదేచ్చగా క్రమక్రమంగా ఆ స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారని అన్నారు.

ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు మరియు సబ్ కలెక్టర్ వెంటనే స్పందించి చెరువు ఆక్రమణలను కబ్జాదారుల కోరల నుండి కాపాడి ప్రభుత్వ ఆస్తులను సంరక్షించాలని విజ్ఞప్తి చేశారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








