– ముఖ్యఅతిథిగా కామారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు అరుణతార రాక
– వివరాలు వెల్లడించిన నసురుల్లాబాద్ మండల అధ్యక్షుడు సున్నం సాయిలు
కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నసురుల్లాబాద్ మండల కేంద్రంలో (NRI) కోనేరు శశాంక్ ఆర్థిక సహకారంతో గురువారం రోజు ఉదయం 10 గంటలకు రామాలయం ప్రాంగణంలో నసురుల్లాబాద్ మండల స్థాయిలో ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా నసురుల్లాబాద్ బిజెపి మండల అధ్యక్షుడు సున్నం సాయిలు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కామారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు అరుణతార హాజరవుతున్నారని తెలియజేశారు. ఈ ముగ్గుల పోటీలలో ఆసక్తి గల మహిళలు, బాలికలు అధిక సంఖ్యలో పాల్గొని అందమైన రంగవల్లులను శ్రీరాముడి సన్నిధిలో అలంకరించి తమ నైపుణ్యంతో బహుమతులు గెలుచుకోవాలని కోరారు. అదేవిధంగా నసురుల్లాబాద్ బిజెపి మండల మరియు జిల్లా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








