V1News Telangana

best news portal development company in india

గురుకుల పాఠశాలలో దరఖాస్తులకు ఆహ్వానం….

SHARE:

– పాఠశాల ప్రిన్సిపల్ మాధవరావ్

కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల గిరిజన గురుకుల పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 5 వ తరగతిలో చేరే విద్యార్థులకు 80 సీట్లు ఖాళీగా ఉన్నాయని.. సీట్ల భర్తీకి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ మాధవరావ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 1 వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించడానికి చివరి తేదీ అని పేర్కొన్నారు. ఫిబ్రవరి 23 వ తేదీన పోటీ పరీక్ష నిర్వహించబడుతుందని సూచించారు.

ఆసక్తిగల ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు జనరల్ కులాల కు చెందిన విద్యార్థులు కులము సర్టిఫికేట్ , ఆదాయం సర్టిఫికేట్, ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్ మరియు పాస్ పోర్ట్ సైజు ఫోటో లను సమర్పించి ఆన్ లైన్ లో వివరాలను నమోదు చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ గురుకులాల్లో చేరి క్రమశిక్షణతో విద్యావంతులై ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india