బిజెపి జిల్లా అధికార ప్రతినిధి చందూరి హన్మండ్లు
కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల తహసిల్దార్ కార్యాలయం లో మంగళవారం రోజు బిజెపి ఓబీసి మోర్చ నాయకులు డిప్యూటీ తహసిల్దార్ బావయ్య కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధికార ప్రతినిధి చందూరి హన్మండ్లు మాట్లాడుతూ ..శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి పట్టణంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను అమలు పరచాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను వెంటనే అమలు పరచాలని బిజెపి ఓబిసి మోర్చా తరపున డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం బడ్జెట్లో బీసీలకు రూ. 20వేల కోట్లు కేటాయిస్తామన్న హామీని ఇప్పటివరకు అమలు పరచలేదని తెలిపారు. గత సంవత్సరానికి గాను రూ.20వేల కోట్లు .. ఈ సంవత్సరానికి గాను రూ. 20 వేల కోట్లు మొత్తం రూ.40 వేల కోట్లు ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రకటించాలని కోరారు. ఆగ మేఘాల పైన కులగణన సర్వే నిర్వహించిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు దానిపై ఎటువంటి వివరాలు వెల్లడించలేదని అన్నారు. శాసనసభ సమావేశాలలో ఇప్పటివరకు ఈ అంశాన్ని ప్రస్తావించలేదని ఆరోపించారు. బీసీలకు రిజర్వేషన్లు , నిధులు, సంక్షేమం, కులాల వారీగా గంగపుత్ర, గౌడ్స్, మున్నూరు కాపు, పద్మశాలి, విశ్వకర్మ, రజకులకు రిజర్వేషన్ల దామాషా ప్రకారం వారికి న్యాయంగా చెందవలసిన అభివృద్ధి ఫలాలను త్వరితగతిన అమలు పరచాలని విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్ల ప్రకారం వారికి అందవలసిన ప్రయోజనాలు, వెసులుబాటు ప్రభుత్వం సక్రమంగా కల్పించడం వల్ల వారు వ్యాపార రంగాలలో, చేతివృత్తులు, కులవృత్తుల ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెంది ఆత్మగౌరవంతో బ్రతుకుతారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఓబిసి మోర్చ మండల అధ్యక్షులు అక్కం లక్ష్మణ్ , శక్తి కేంద్రం ఇంచార్జ్ గంగాధర్ గుప్తా, శేఖర్, బల్బీర్ సింగ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








