V1News Telangana

best news portal development company in india

అయోమయంలో హుమ్నాపూర్ సొసైటీ పరిస్థితి….

SHARE:

– శిధిలావస్థకు చేరుకున్న దుస్థితి

– పట్టించుకోని పాలకులు, అధికారులు

బోధన్ ప్రతినిధి:

నిజామాబాద్ జిల్లా: వర్ని మండలం లోని హుమ్నాపూర్ గ్రామ సొసైటీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారిందని.. ప్రస్తుతం అయోమయ పరిస్థితిలో ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు.1993లో నిర్మించిన ఈ సొసైటీ భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరిందని ..దీన్ని మరమ్మతులు చేయడం లేదా నూతన భవనం నిర్మాణంలో పాలకులు ముందుకు వస్తే బాగుంటుందని గ్రామస్తులు రైతులు కోరుతున్నారు.ఈ సొసైటీ పరిధిలో ఘన్ పూర్, బొప్పాపూర్ రెండు గ్రామాలు ఉన్నాయి, చందూర్ మండలం కావడంతో ఘన్ పూర్ గ్రామం చందూరు మండలం కు వెళ్లడం ,రుద్రూర్ మండలం కావడంతో బొప్పాపూర్ గ్రామం రుద్రూర్ మండలంలోకి వెళ్లడం, హుమ్నాపూర్ సొసైటీ కి శాపంగా మారింది, ఘన్ పూర్ గ్రామ రైతులు చందూర్ సొసైటీకి వెళ్తామని బొప్పాపూర్ గ్రామ రైతులు రుద్రూర్ సొసైటీ పరిధిలోకి వెళ్తామని, హుమ్మాపూర్ సొసైటీ పరిధిలో సుమారు 250 మంది రైతులు సంఘ సభ్యులుగా ఉన్నప్పుడు దీనిలో వివిధ మండలాల రైతులు అక్కడికి వెళ్తామని అందులోనే ఉంటామని కరాకండిగా చెప్పడం.. అదేవిధంగా ఈ పంచాయతీ బాన్సువాడ నియోజకవర్గంలోని పెద్ద సారు వద్దకు వెళ్ళింది, ఒకవేళ ఘన్ పూర్ గ్రామ రైతులు బొప్పాపూర్ గ్రామ రైతులు వారి మండల పరిధిలో ఉన్న సొసైటీ పరిధిలోకి వెళ్తే, హుమ్నాపూర్ సొసైటీ పరిస్థితి అయోమయం లో ఉంటుందని ఉంటుందా పోతుందా అనే సందిగ్ధం లో పరిస్థితులు నెలకొంటున్నాయని.. ఈ పంచాయతీ పెద్ద సారుకు తలనొప్పిగా మారిందని హుమ్నాపూర్ గ్రామంలోని పెద్దలు మాత్రం మూతపడే పరిస్థితిలు, రైతులు ఆయా సొసైటీ లకు వెళ్ళనీయకుండా చర్చలు జరిపి హుమ్నాపూర్ సొసైటీని అభివృద్ధి పరచడంలో కసరత్తులు చేస్తున్నారని వాదనలు జోరుగా వినిపిస్తున్నాయి.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india