V1News Telangana

best news portal development company in india

అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు….

SHARE:

– జిల్లా ఇన్చార్జ్ మంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం

– ప్రజల త్రాగునీటి అవసరాలు తీరాలని ఆకాంక్ష

– తెలంగాణ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎక్సైజ్ కార్యాలయం మరియు అమృత్ 2.0 లో భాగంగా బాన్సువాడ పట్టణంలో మంచినీటి సరఫరా పనుల శంకుస్థాపన కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యఅతిథిగా హాజరుకానున్న సందర్భంగా సభాస్థలి వద్ద ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు సూచనలు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి,

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ నూతన భవనం , మరియు పట్టణ ప్రజలకు త్రాగునీటి సరఫరా గురించి ఏర్పాటుచేసిన శంకుస్థాపన కార్యక్రమాలకు విచ్చేస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావుకు స్వాగతం పలికారు. ప్రజలకు త్రాగునీటి వెతలు తీరాలని అన్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి మరింత పాటుపడతానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్ రాజ్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india