– చదువుతోనే సమాజంలో గౌరవ మర్యాదలు దక్కుతాయి
– కానిస్టేబుల్ ఉద్యోగం పొందిన యువకుడికి అభినందనలు
– ప్రభుత్వ ఉద్యోగంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
– తల్లిదండ్రులకు, గ్రామానికి గొప్ప పేరు సంపాదించి పెట్టాలి
– మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్ వ్యాఖ్యలు
కామారెడ్డి ప్రతినిధి: బీర్కూర్ మండలంలోని బైరాపూర్ గ్రామానికి చెందిన ఇప్పల అంజా గౌడ్ సావిత్రి దంపతుల కుమారుడు శ్రీకాంత్ గౌడ్ మొదటి విడత లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించాడు. ఈ క్రమంలో సోమవారం రోజు మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్ వారి ఇంటి వద్దకు వెళ్లి కార్యకర్తల సమక్షంలో.. శ్రీకాంత్ గౌడ్ ను మరియు అతని తల్లిదండ్రులను పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా ద్రోణవల్లి సతీష్ మాట్లాడుతూ శ్రీకాంత్ గౌడ్ కష్టపడి ,పట్టుదలతో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించడం అభినందనీయం అని అన్నారు. అతనిని కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు అని ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు వారి కుమారుడిని ఈ స్థాయికి తీసుకురావడం గర్వకారణం అని అన్నారు. ఇదేవిధంగా యువత ప్రతి ఒక్కరూ పట్టుదలతో శ్రమించి ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో ఉద్యోగాలు సంపాదించుకొని.. సమాజానికి సేవలు అందించాలని సూచించారు. చదువు తో సమాజంలో గొప్ప గౌరవ మర్యాదలు దక్కుతాయని తెలిపారు. విధినిర్వహణలో నిజాయితీగా పనిచేస్తూ తల్లిదండ్రులకు మరియు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ గుమ్మ లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ బేగరి అంజయ్య, పిఎసిఎస్ చైర్మన్ సాయి, శ్యామ్, గాదె మోహన్, దుబాయ్ విట్టల్, కల్లు పండరి, కృష్ణమూర్తి, సమ్ దాని, మల్లికార్జున్, గోసం పెద్ద సాయిలు, అంజా గౌడ్, కృష్ణ ప్రసాద్, శ్రీశైలం గౌడ్, యూసుఫ్, గ్రామ పెద్దలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








