– బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఆయేషా ఫాతిమా
బోధన్ ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లా: బోధన్ మండలంలోని బెల్లాల్ గ్రామానికి చెందిన కట్టా గంగాధర్ గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇప్పటివరకు మృతుని కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కు సంబంధించిన ప్రమాద బీమా మాత్రమే వచ్చిందని తెలియజేశారు. సోమవారం రోజు బోధన్ మాజీ శాసనసభ్యులు షకీల్ సతీమణి , బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఆయేషా ఫాతిమా మృతుడి భార్య పద్మ ను పిలిపించుకొని రూ.2 లక్షల ప్రమాద బీమా చెక్కును అందించారు. ఈ సందర్భంలో బోధన్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ కుమార్, బోధన్ టౌన్ అధ్యక్షుడు రవీందర్ యాదవ్, బోధన్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ యువజన అధ్యక్షుడు తోట శ్రీనివాస్, బోధన్ మండల యువజన అధ్యక్షుడు గణేష్ పటేల్, బర్దిపూర్ గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి, బెల్లాల్ గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులు బుర్రి లక్ష్మణ్, రాజేందర్, రాజు, శ్రీనివాస్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








