V1News Telangana

best news portal development company in india

ముఖ్యమంత్రిని నిలదీసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు….

SHARE:

– ఎన్నికల హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం

– రైతు భరోసాపై రెండు నాలుకల ధోరణి

– ఎగ్గొట్టిన రైతు భరోసా డబ్బులు ఎప్పుడు ఇస్తారు…?

– భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి రైతులే ఓటుతో తగిన బుద్ధి చెబుతారు

– బిఆర్ఎస్ బాన్సువాడ పట్టణ సీనియర్ నాయకులు మోచి గణేష్

– నస్రుల్లాబాద్ మండల సీనియర్ నాయకులు గొడిసెల నర్సింలు గౌడ్

బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో మరియు నసురుల్లాబాద్ మండల కేంద్రంలో శనివారం రోజు బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు” రైతు భరోసా”విషయంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా గోడ ప్రతులను అతికించి రైతులకు మద్దతు తెలుపుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ బాన్సువాడ పట్టణ సీనియర్ నాయకులు మోచి గణేష్ మరియు నసురుల్లాబాద్ మండల సీనియర్ నాయకులు గొడిసెల నర్సింలు గౌడ్ మాట్లాడుతూ ..శాసనసభ ఎన్నికల హామీలలో రైతు భరోసా ఆర్థిక సహాయం సంవత్సరానికి ఒక ఎకరానికి రూ.15000 ఇస్తామని ప్రగల్బాలు పలికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ .. ఈరోజు మాటలు మార్చి ఎకరానికి రూ. 12000 ఇస్తామని చెప్పడం రాష్ట్ర రైతాంగాన్ని నయవంచన చేయడమే.. అది సిగ్గుచేటు అని అన్నారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి రైతుబంధు విషయంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ కెసిఆర్ ను విమర్శించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎకరానికి రూ.15000 ఇస్తామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిపోయినప్పటికీ ఇప్పటివరకు పదివేల రూపాయలు కాదు కదా..ఒక్క రైతు ఖాతాలో కూడా రూపాయి వేసిన పాపాన పోలేదని ఎద్దేవా చేశారు. ఎగ్గొట్టిన రైతు భరోసా డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని ముఖ్యమంత్రిని నిలదీశారు. మాయమాటలతో రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో రైతులే తమ ఓటు ద్వారా తగిన బుద్ధి చెబుతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సర్వేల పేరిట కాలయాపన చేస్తూ రోజులు గడుపుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ రైతులకు మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో , గ్రామాలలో గోడ ప్రతులను అతికించి రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివ సూరి, అనిల్, టేకుర్ల సాయిలు, దేశ్ పాక్ సాయిలు, లక్ష్మణ్, రాజ్ కుమార్, దిలీప్, రమేష్, సాయి, అనీష్, హన్మండ్లు, రజనీకాంత్, రాజశేఖర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india