మంత్రి రాకకు భారీ ఏర్పాట్లు….
– ఎక్సైజ్ శాఖ భవనం , అమృత్ 2.0 (మంచినీటి సరఫరా) పనుల పరిశీలన
– సంబంధిత శాఖ అధికారులకు పలు సూచనలు
– సభాస్థలి వద్ద ఏర్పాట్ల పర్యవేక్షణ
– తెలంగాణ వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎక్సైజ్ కార్యాలయం ప్రారంభోత్సవానికి మరియు అమృత్ 2.0 లో భాగంగా పట్టణంలో మంచినీటి సరఫరా శంకుస్థాపన కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా జనవరి 7 వ తేదీన రాష్ట్ర ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విచ్చేస్తున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా ఎక్సైజ్ కార్యాలయం, అమృత్ 2.0 శంకుస్థాపన కార్యక్రమ ఏర్పాట్లను మరియు సభాస్థలిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.సంబంధిత శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, కృష్ణారెడ్డి, ఎజాజ్, అంజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్ అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








