V1News Telangana

ప్రజల అందుబాటులోకి మృత దేహాలను ఉంచే బాడీ ఫ్రీజర్లు  ప్రజలు ఈ సౌకర్యం ఉపయోగించుకోవాలి  పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్  స్థానిక సంస్థలు రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ ఎఫ్ ఎ సి  జె. అరుణ శ్రీ.

ప్రజల అందుబాటులోకి మృత దేహాలను ఉంచే బాడీ ఫ్రీజర్లు  ప్రజలు ఈ సౌకర్యం ఉపయోగించుకోవాలి 

పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్  స్థానిక సంస్థలు రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ ఎఫ్ ఎ సి  జె. అరుణ శ్రీ.

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం జనవరి 04:-

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో  మృత దేహాలను ఉంచే బాడీ ఫ్రీజర్లు మరమ్మత్తు చేయించి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు  రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్  ఎఫ్ ఎ సి జె. అరుణ శ్రీ ఒక ప్రకటనలో తెలిపారు.   రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో మూడు బాడీ ఫ్రీజర్లు వున్నప్పటికీ గత కొంతకాలంగా  పని చేయడం లేదు. దీంతో అవసరమైన వారు ప్రయివేట్ వ్యక్తులను/ సంస్థలను ఆశ్రయిస్తూ వ్యయ ప్రయాసలకు గురవుతున్నారని దృష్టికి వచ్చిన వెంటనే వాటిని మరమ్మత్తు చేయించి ఉపయోగంలోకి తీసుకువచ్చినట్లు కమిషనర్ తెలిపారు. రామగుండం ప్రజానీకం ఇకనుండి నేరుగా మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లి ఆధార్ కార్డు రేషన్ కార్డ్ వివరాలు నమోదు చేసుకొని బాడీ ఫిజెర్లు ఉపయోగించుకోవాలని అధికారులు తెలిపారు. అలాగే ఈ బాడీ ఫ్రీజర్లు కావాలసినవారు ఆధార్ కార్డు , రేషన్ కార్డు , చిరునామా తదితర వివరాలు సమర్పించి ఉచితంగా తీసుకువెళ్లవచ్చని తెలిపారు. ఇట్టి సేవలు పొందడానికి ఫోన్ నెం 9603 666 444 , టోల్ ఫ్రీ నెంబర్ 18004257062 లను సంప్రదించాలని కోరారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Infoverse Academy

Vote Here

[democracy id="1"]

Recent Post