– సమయపాలన పాటించని తహసిల్దార్
– తన బాటలోనే పయనిస్తున్న మిగతా సిబ్బంది
– కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తూ ప్రజలు ఎదురుచూపులు
కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు సమయానికి హాజరు కాకపోవడం వల్ల ప్రజలు పడిగాపులు కాస్తూ అధికారుల రాక కొరకు ఎదురుచూపులు చూస్తూ ఇబ్బందులు పడుతున్నారు.

శుక్రవారం రోజు కిందిస్థాయి సిబ్బంది సమయానికి హాజరైనప్పటికీ తహసీల్దార్ ఎల్. ప్రవీణ్ కుమార్, నాయబ్ తహసీల్దార్ బావయ్య హుందాగా 10 గంటల 54 నిమిషాలకు విధులకు హాజరయ్యారు. ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10 గంటలకు తెరుచుకుంటాయని.. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు పంట పొలాల్లో వరి నాట్లు వేసే పనుల్లో తీరిక లేనప్పటికీ .. ఉదయం వేళలో తొందరగా రిజిస్ట్రేషన్, తదితర పనులు ముగించుకోవాలని ఆత్రుతగా వచ్చినప్పటికీ అధికారులు లేకపోవడం వల్ల గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పోటీ పరీక్షలలో విద్యార్థులకు నిమిషం కూడా ఆలస్యం కాకూడదని కఠిన నిబంధనలు అమలుపరిచే ప్రభుత్వం .. ప్రభుత్వ ఉన్నతాధికారుల విషయంలో ఎందుకు అమలు పరచడం లేదని ప్రజలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారుల తీరుపై సిబ్బంది సైతం అసహనం వ్యక్తం చేయడం గమనార్హం.. తాము సమయానికి హాజరు కాకపోయినా, తదితర విషయాలలో క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారులు వారిని అడిగే వారు లేరు అన్నట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని ప్రజలతో చర్చించుకుంటున్నారు.

ఇప్పటికైనా నాయకులు, సబ్ కలెక్టర్ స్థానిక తహసిల్దార్ కార్యాలయం పై ప్రత్యేక దృష్టిసారించి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








