V1News Telangana

best news portal development company in india

సీఎం కప్ రాష్ట్రస్థాయి టోర్నమెంట్ లో ప్రతిభ కనబరిచిన మల్ల యోధులు….

SHARE:

కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: హన్మ కొండ లో నిర్వహించిన సీఎం కప్ ..2024 రాష్ట్రస్థాయి టోర్నమెంట్ లో రెజ్లింగ్ (మల్ల యోధులు) పోటీలలో జిల్లాకు చెందిన క్రీడాకారులు ప్రతిభను కనబరిచి బహుమతులు సాధించారు. సబ్ జూనియర్స్ బాలుర రెజ్లింగ్ పోటీలలో పి .అనిల్ 45 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్, ఎం .శ్రీకాంత్ 51 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్, జూనియర్ బాలుర రెజ్లింగ్ పోటీలలో జి .ప్రశాంత్ 57 కేజీల విభాగంలో బ్రాంజ్ మెడల్ , ప్రవీణ్ 60 కేజీల విభాగంలో బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకోగా.. సబ్ జూనియర్స్ బాలికల రెజ్లింగ్ పోటీలలో జె. త్రిష 49 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్, జె .రోజా 46 కేజీల విభాగంలో బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా రెజ్లింగ్ విభాగంలో 13 మంది విద్యార్థులు పాల్గొనగా ఆరుగురు విద్యార్థులు మాత్రమే పథకాలు సాధించారు. పాల్గొన్న వారిలో బాలురు బి. వినోద్ 60 కేజీల విభాగం, జి .భూషణం 61 కేజీల విభాగం, బాలికలు సిహెచ్. మీనాక్షి 43 కేజీల విభాగంలో, సిహెచ్. అఖిల 53 కేజీల విభాగంలో, ఎం .శివాని 50 కేజీల విభాగంలో పోరాడి ఓటమిపాలై నిరాశపరిచారు. రాష్ట్రస్థాయి టోర్నమెంట్ పోటీలలో పాల్గొని పథకాలు సాధించిన క్రీడాకారులను మరియు కోచ్ మేనేజర్స్ డి. శ్రీనివాస్ ను కామారెడ్డి జిల్లా ఆమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ తరపున అధ్యక్షులు పి .వెంకటి, కార్యదర్శి బి .సాయిలు, అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు అభినందనలు తెలిపారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india