V1News Telangana

best news portal development company in india

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు….

SHARE:

– కుల ,మత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి

– 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాల ప్రారంభం

– మహిళల సకల హక్కుల కొరకు అలుపెరుగని పోరాటం చేసిన స్త్రీ మూర్తి

– పురుషాధిక్య ధోరణులు కలిగినవారికి గట్టి సమాధానం

– ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గునిగెరి హన్మండ్లు

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలో గల ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం రోజు సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని , మహిళా ఉపాధ్యాయ దినోత్స వాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయినిలను ప్రధానోపాధ్యాయులు గునిగెరి హన్మండ్లు శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే రచయిత్రి మరియు నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన గొప్ప భారతీయ సంఘసంస్కర్త.. ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని అన్నారు. ఆమె తన భర్తతో కలిసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది అని తెలిపారు. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, మహిళల సకల హక్కుల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేసి.. సమాజంలోని కులతత్వం, పురుషాధిక్య ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ గట్టిగా సమాధానం చెబుతూ .. పీడిత ప్రజలు, ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి అలుపెరుగని కృషిచేసి వారి అభ్యున్నతికి పాటుపడిన తొలితరం మహిళా ఉద్యమకారిణి అని విద్యార్థులకు తెలుపుతూ కొనియాడారు. ఆమె చేసిన కృషి నేటి సమాజంలో మహిళలు విద్యారంగంలో ఉపాధ్యాయినులుగా రాణిస్తూ ఆత్మగౌరవంతో ముందుకు సాగుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కాంచన, పుష్పలత, అనూష, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india