V1News Telangana

best news portal development company in india

ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యం సరైన మెయింటెనెన్స్ లేని బస్సులను రోడ్లపై తిప్పుతున్న వైనం  బస్సు బ్రేక్ డౌన్ తో మధ్యలోనే ఆపిన కండక్టర్ బస్ డ్రైవర్ మరో బస్సు ఎక్కించి ప్రయాణికులను పంపించిన వైనం

SHARE:

ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యం సరైన మెయింటెనెన్స్ లేని బస్సులను రోడ్లపై తిప్పుతున్న వైనం

బస్సు బ్రేక్ డౌన్ తో మధ్యలోనే ఆపిన కండక్టర్ బస్ డ్రైవర్ మరో బస్సు ఎక్కించి ప్రయాణికులను పంపించిన వైనం

 

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం జనవరి 03:-

గోదావరిఖని డిపో ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యం TS22T7207 కరీంనగర్ నుంచి గోదావరిఖని వచ్చే పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ అవడంతో మధ్యలోనే ఆపిన వైనం గతంలో రెండుసార్లు బ్రేక్ డౌన్ అయినప్పటికీ యాజమాన్యం పట్టించుకోవట్లేదని పలు ఆరోపణలు చేస్తున్న బస్సు డ్రైవర్ కండక్టర్ ఇది మూడోసారి కావడంతో ప్రయాణికులు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. సరైన సర్వీసింగ్లు సరైన మెయింటెనెన్స్ లేక ఆర్టీసీ బస్సుల నడుపుతున్న యాజమాన్యం తీరుపై ప్రజలు అసంతృప్తి చెందుతున్నారు. ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులు సరైన కండిషన్ లో ఉందో లేదో చెక్ చేయకుండానే రోడ్లపై తిప్పడం ప్రశ్నార్థకంగా మారింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రజలకు అధిక చార్జీలు వేస్తూ ప్రయాణికుల జేబులకు చిల్లుపడే విధంగా వ్యవహరిస్తున్నట్లు పలువురు ప్రజలు మండిపడుతున్నారు. ఈ సంఘటనపై ఆర్టీసీ అధికారులు రవాణా శాఖ అధికారం జిల్లా కలెక్టర్ అధికారులు స్పందించి చర్య తీసుకోవాలని ప్రజల డి దిమైండ్ చేస్తున్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india