– తాగిన మైకంలో తండ్రితో గొడవ
– విచక్షణ రహితంగా పిడి గుద్దులతో దాడి
– గాఢ నిద్రలో ఉండగా దిండుతో అదిమిపెట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసిన వైనం
V1 న్యూస్ నిజామాబాద్ ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లా:తాగిన మైకంలో కన్న కొడుకే కాలయముడై తండ్రిని కడతేర్చిన ఘటన నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అంబం గామంలో సోమవారం రోజు వెలుగులోకి వచ్చింది. సీఐ కృష్ణ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మహబూబ్ ఆదివారం రాత్రి తాగిన మైకంలో తన తండ్రి షేక్ హైమద్ (65)తో గొడవ పడ్డాడని పెద్ద కుమారుడు జమీల్ పోలీసులకు వివరాలు తెలిపారు.

ఈ క్రమంలో మహబూబ్ తండ్రిపై విచక్షణారహితంగా పిడి గుద్ధుల దాడి చేసి అనంతరం ముఖంపై గట్టిగా దిండు అదిమి పెట్టి ఊపిరి ఆడకుండా చేయడం వలన హైమద్ మృతి చెందాడని.. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హత్య కేసు గా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కృష్ణ వెల్లడించారు. హైమద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించామని తెలిపారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








