V1News Telangana

best news portal development company in india

ఆర్థిక సంస్కర్తకు నివాళులు అర్పించిన నాయకులు…..

SHARE:

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలో శనివారం రోజు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ మండల నాయకులు, ఏనుగు రవీందర్ రెడ్డి అనుచరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.ఈ సందర్భంగా మాజీ AMC చైర్మన్ పాత బాలకృష్ణ మరియు నాయకులు అక్బర్ మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ గొప్ప నాయకుడని.. భారతదేశం మంచి నేతను కోల్పోయిందని.. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గొప్ప మేధాశక్తి ఉన్న నాయకుడిని కోల్పోయిందని అన్నారు . ఆయన ఎన్నో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన గొప్ప ఆర్థికవేత్త అని అభివర్ణించారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా కూడా విధులు నిర్వహించారని గుర్తు చేశారు.

గొప్ప నాయకత్వ లక్షణాలతో రాజకీయ పార్టీల మన్ననలు పొంది కాంగ్రెస్ పార్టీ తరపున భారత దేశ ప్రజలకు రెండు పర్యాయాలు పూర్తి కాలం 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఎనలేని సేవలను అందించారని కీర్తించారు. ఆయన మృదు స్వభావి, వివాదా రహితుడు.. మచ్చలేని వ్యక్తి అని కొనియాడారు .ప్రతి ఒక్కరూ ఆ మహానుభావుడిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంత్రి గణేష్, కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భాను గౌడ్, నాయకులు మల్లూరి సాయిలు, చందర్, లాయక్, రవీందర్ రెడ్డి, ఖాదర్, అఖిల్, సాయిలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india