– దర్యాప్తు అధికారిగా సదాశివ నగర్ సీఐ సంతోష్ కుమార్ కు అదనపు బాధ్యతలు
– త్వరితగతిన కేసు వివరాలను నివేదిక సమర్పించాలని ఆదేశాలు
– జిల్లా ఎస్పీ సింధు శర్మ
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భిక్కనూర్ ఎస్సై సాయికుమార్, కానిస్టేబుల్ శృతి , సహకార సంఘం కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ముగ్గురి మృతి మిస్టరీ కేసును చేదించడానికి పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలో కేసు దర్యాప్తు అధికారిగా సదాశివ నగర్ సీఐ సంతోష్ కుమార్ కు జిల్లా ఎస్పీ సింధు శర్మ అదనపు బాధ్యతలు అప్పగించారు. అంతేకాకుండా ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. మృతుల ఫోన్ కాల్ డాటా మరియు వాట్సాప్ చాటింగ్ లలో , అదేవిధంగా చనిపోవడానికి ముందు వారి కదలికలకు అనుగుణంగా సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా వివరాలను సేకరించాలని ఆదేశించారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








