బోధన్ లో జోరుగా అక్రమ మొరం వ్యాపార..
బోధన్ మండలంలోని అందాపూర్ గ్రామ శివారులో ని ప్రభుత్వ భూమిలో కొందరు అక్రమార్కులు తమ జీరో వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఇందుకు రెవెన్యూ శాఖలోని కొందరు అక్రమార్కు మొరం వ్యాపారస్తులకు అండగా నిలుస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి బుధ, గురువారం రెండు రోజుల పాటు సెలవు దినాలు కావడంతో మొరం వ్యాపారులు రెచ్చి పోయి యథేచ్ఛగా మొరం అక్రమ రవాణాకు తెరలేపారు. రాత్రి పగలు తేడాలేకుండా మొరం రవాణా ను సాగిస్తున్న అక్రమ మొరం రవాణా సాగిస్తున్నరు. అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూడక పోవడంతో మొరం రవాణా జోరుగా సాగిస్తున్నారు. సామాన్య ప్రజల అవసరాలు అదునుగా చేసుకున్న వ్యాపారస్తులు రూ 2500 నుండి 3000 వేలకు విక్రయిస్తునరని పలువురు ఆరోపిస్తున్నారు.
అటు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ నిబంధనలు ఉల్లంఘించి తమ కార్యకలాపాలను సాగిస్తున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారు. అధికారులు స్పందించి మొరం అక్రమ వ్యాపారాన్ని కట్టడి చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








